Moto: "Moto G04s" సింపుల్ కాదు.. సూపర్ స్మార్ట్‌ఫోన్! 10 d ago

featured-image

బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ కంపెనీలలో మోటోరోలా ఒకటి. తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉండే ఫోన్లు తయారుచేయడంలో మోటోరోలా No.1 అనే చెప్పాలి. ఫ్యాన్సీ ఫీచర్లు లేకుండా..అతితక్కువ ధరలో అదిరిపోయే Moto G04s ఫోన్‌ని తీసుకొచ్చింది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ లో పెద్ద స్క్రీన్‌, శక్తివంతమైన బ్యాటరీ.. మంచి కెమెరా కూడా ఉన్నాయి. సింపుల్ డిజైన్ తో చాలా బాగుంటుంది ఈ ఫోన్. మరెందుకు ఆలస్యం ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి!


Moto G04s ఫీచర్లు:

ప్రాసెసర్: Unisoc T606

డిస్‌ప్లే: 6.6-అంగుళాల HD+ IPS LCD

రిఫ్రెష్ రేట్: 90Hz

బ్యాక్ కెమెరా: 50MP మెయిన్ కెమెరా

ఫ్రంట్ కెమెరా: 5MP

బ్యాటరీ: 5000mAh

ఛార్జింగ్: 15W ఫాస్ట్ ఛార్జింగ్

ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 14

4GB RAM + 64GB స్టోరేజ్.. Expandable upto 1 TB


కనెక్టివిటీ ఫీచర్లు:

  • బ్లూటూత్ 5.0
  • USB టైప్-C పోర్ట్
  • Wi-Fi 5
  • 4G డ్యూయల్ సిమ్


ఇతర ఫీచర్లు:

  • సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్
  • 3.5mm ఆడియో జాక్
  • డాల్బీ అట్మోస్


ఫోన్ రంగులు:

  • శాటిన్ బ్లూ
  • కాంకర్డ్ బ్లాక్
  • సన్‌రైజ్ ఆరంజ్


లోపాలు:

Unisoc T606 ప్రాసెసర్ కారణంగా ఇది గేమింగ్ కి పెద్దగా బాగోదు. ఈ ఫోన్ కేవలం ఒక వేరియంట్ తోనే వస్తుంది. తక్కువ రిజల్యూషన్ వల్ల‌ వీడియోలు, ఫోటోలు అంత స్పష్టంగా కనిపించకపోవచ్చు. ఈ ఫోన్ కు 5G నెట్‌వర్క్ సపోర్ట్ లేదు.


Moto G04s రోజువారీ సాధారణ అవసరాలకు సరిపోతుంది. పెద్ద స్క్రీన్, రోజంతా వచ్చే బ్యాటరీ.. తక్కువ ధరలో కోరుకునేవారికి ఇది మంచి ఎంపిక. ఇది తక్కువ ధరలో లభించే ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ ధర రూ.7,999 నుండి ప్రారంభం అవుతుంది.. బ్లాక్ కలర్ కావాలంటే ఒక వెయ్యి ఎక్కువ పెట్టాల్సిందే. అన్ని స్టోర్లలో అందుబాటులో ఉంది.


ఇది చదవండి: Oppo K12X బడ్జెట్ ధరకే .. భారీ ఫీచర్లతో 5G మొబైల్.!



Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD